కోర్ట్ కేసులో ‘ది రాజా సాబ్‘

కోర్ట్ కేసులో ‘ది రాజా సాబ్‘
X
రెబెల్ స్టార్ ప్రభాస్ నుంచి ఇమ్మీడిట్ గా రావాల్సిన చిత్రం ‘ది రాజా సాబ్‘. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

రెబెల్ స్టార్ ప్రభాస్ నుంచి ఇమ్మీడిట్ గా రావాల్సిన చిత్రం ‘ది రాజా సాబ్‘. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే.. లేటెస్ట్ గా ‘ది రాజా సాబ్‘ మూవీ కోర్టు చిక్కుల్లో పడింది.

ఈ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (PMF) మరియు ముంబై కేంద్రంగా ఉన్న ఐవై ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (IVY) మధ్య ఆర్థిక వివాదం ఢిల్లీ హైకోర్టు వరకు చేరి, సినిమా విడుదల ప్రశ్నార్థకంగా మారింది. అసలు విషయం ఏమిటంటే ‘ది రాజా సాబ్‘ కోసం PMF, IVY మధ్య భారీ ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం IVY మొత్తం రూ.225 కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఇందులో రూ.218 కోట్లు ఇప్పటికే PMF కి బదిలీ చేశారు.

అయితే వివిధ కారణాలు చెబుతూ IVY ఒప్పందాన్ని రద్దు చేస్తూ రూ.218 కోట్లు వడ్డీతో తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. PMF సమయానికి షూటింగ్ పూర్తి చేయకపోవడం, అప్‌డేట్స్ ఇవ్వడంలో ఆలస్యం, నిధుల వినియోగంపై స్పష్టత లేకపోవడమే కారణమని వారు ఆరోపించారు. PMF మాత్రం తమవంతు పెట్టుబడి IVY కంటే ఎక్కువ పెట్టామని, ప్రాజెక్ట్ కొనసాగించడానికే అది చేశామని స్పష్టం చేసింది.

మరోవైపు IVY, PMF‌పై ఒప్పంద ఉల్లంఘన ఆరోపణలు చేస్తూ, సినిమా విడుదలను కేసు తీర్పు వచ్చే వరకు ఆపాలని కోరింది. తాజా విచారణలో PMF, IVY పెట్టుబడి మొత్తం రూ.218 కోట్లు వడ్డీతో సినిమా విడుదలకు ముందే తిరిగి చెల్లిస్తామని, దానికి ప్రతిగా IVY కి ‘ది రాజా సాబ్‘ హక్కులు లేకుండా చేయాలని ప్రతిపాదించింది. మరి.. ఈ వివాదం ఎంతవరకూ వెళుతుందో చూడాలి.

Tags

Next Story