‘ది ప్యారడైజ్‘ కౌంట్‌డౌన్ స్టార్ట్!

నేచురల్ స్టార్ నాని నుంచి రాబోతున్న ఊర మాస్ ఎంటర్ టైనర్ ‘ది ప్యారడైజ్‘. అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరీ లైన్ తో శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ‘ది ప్యారడైజ్‘ నుంచి వచ్చిన గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కింది. నాని ఈ సినిమాలో రెండు జడల స్టైల్‌తో కొత్త లుక్‌లో కనిపించగా, అతని గెటప్ సంచలనంగా మారింది. ఈ గ్లింప్స్ పై కొన్ని విమర్శలు వచ్చినా.. ఈ చిత్రం కోసం నేచురల్ స్టార్ నాని అభిమానులే కాదు.. యావత్ పాన్ ఇండియా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వచ్చే యేడాది మార్చి 26న ‘ది ప్యారడైజ్‘ రిలీజ్ కాబోతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చూస్తూ ఈ మూవీకి కౌంట్ డౌన్ మొదలు పెట్టింది టీమ్. అందుకు సంబంధించి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో నాని గన్ పట్టుకుని, పేలుళ్ల నడుమ గంభీరంగా నిలుచుని కనిపించాడు.
ఇక నాని స్వయంగా ట్విట్టర్ ద్వారా కౌంట్‌డౌన్ పోస్టర్‌ను షేర్ చేస్తూ, సినిమా 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుందని వెల్లడించాడు. సరిగ్గా ఈరోజుకి ‘ది ప్యారడైజ్‘ రిలీజ్ కి ఒక సంవత్సరం సమయం ఉంది. ఇప్పటికే నాని-శ్రీకాంత్ లతో ‘దసరా‘ వంటి చిత్రాన్ని నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూరుస్తుండగా, జీకే విష్ణు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ‘ది ప్యారడైస్‘ రెండు భాగాలుగా రాబోతుందనే ప్రచారం ఉంది.
-
Home
-
Menu