'కింగ్‌డమ్' కౌంట్‌డౌన్ ప్రారంభం!

కింగ్‌డమ్ కౌంట్‌డౌన్ ప్రారంభం!
X
'లైగర్' ఫెయిల్యూర్ తర్వాత మళ్లీ గ్రేట్ కమ్‌బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. 'కింగ్‌డమ్'తో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

'లైగర్' ఫెయిల్యూర్ తర్వాత మళ్లీ గ్రేట్ కమ్‌బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. 'కింగ్‌డమ్'తో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. విజయ్ నెవర్ బిఫోర్ లుక్ లో సందడి చేయబోతున్న ఈ సినిమాని గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నాడు. ప్రతిష్ఠాత్మక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో రూపొందుతున్న 'కింగ్‌డమ్' మే 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇదే విషయాన్ని గుర్తు చూస్తూ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ 'కింగ్‌డమ్' ఆగమనానికి ఇంకా 50 రోజుల సమయం మాత్రమే అంటూ ఓ పోస్ట్ పెట్టింది. ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన టీజర్ 'కింగ్‌డమ్'పై అంచనాలను భారీగా పెంచేసింది. టీజర్‌కు ఎన్టీఆర్, సూర్య, రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ద్వారా పాన్-ఇండియా రీచ్ పెరిగింది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ను అందించనున్నారట.

Tags

Next Story