అభిమానుల మద్దతుతో అందుకున్న గౌరవం

యూకే పార్లమెంట్‌లో మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. ఈ ఘన సన్మానాన్ని చిరంజీవి తన హృదయపూర్వక కృతజ్ఞతలతో స్వీకరించారు. ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో స్పందించారు. 'ఇంతమంది గౌరవనీయుల సమక్షంలో ఈ పురస్కారం అందుకోవడం నాకు అపూర్వమైన అనుభూతి. నా సినీ ప్రస్థానం, మానవతా సేవలను గుర్తించి అందించిన ఈ గౌరవం నన్ను మరింత ప్రేరేపిస్తోంది' అని అన్నారు.
అభిమానుల ప్రేమ, సినీ పరిశ్రమ సహకారం, తన మానవతా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి మద్దతు వల్లే ఈ గుర్తింపు లభించిందని చిరంజీవి చెప్పారు. 'నా రక్తదాన సహోదరులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు – ఈ ప్రయాణంలో నా వెంటే నిలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు' అంటూ భావోద్వేగంగా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి తన సన్మానం తాలూకు ఫొటోలను కూడా పంచుకున్నారు. ఈ గౌరవం తన పని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లేలా చేస్తుందన్న ఆయన, తనపై చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
https://x.com/KChiruTweets/status/1902638200490778657
-
Home
-
Menu