'హిట్ 3' హంగామా స్టార్ట్!

ఇంకో నాలుగు రోజుల్లో థియేటర్స్‌లోకి దూసుకురాబోతున్న 'హిట్ 3: ది థర్డ్ కేస్'కి ఇప్పుడు ఏ స్థాయిలో హైప్ ఉన్నదో చెప్పక్కర్లేదు. నాని తన సినిమాల ప్లానింగ్‌లో ఎప్పుడూ ప్రత్యేకమైన చూపిస్తుంటాడు. అదే కోవలో 'హిట్ 3' కోసం ముందస్తు ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేశాడు. సాధారణంగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య లావాదేవీల కారణంగా ఆన్లైన్ టికెట్ సేల్స్ విడుదలకు ఒకటి రెండు రోజులు ముందు మాత్రమే స్టార్ట్ అవడం చూస్తుంటాం.
కానీ 'హిట్ 3' బృందం ఇలాంటి ఆలస్యాలను తొలగిస్తూ ముందస్తు మార్కెటింగ్ పథకాన్ని అమలు చేసింది. ముఖ్యంగా, బుక్ మై షోలో చాలా ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించడంలో ఈ మధ్య కాలంలో ఇతర స్టార్ హీరోల సినిమాలతో పోలిస్తే ప్రత్యేకత చూపించాడు.
ఇక తెలంగాణలో 'హిట్ 3'కి గరిష్ఠంగా అనుమతించిన ధరలే ఫాలో అవుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ.177 గా ఉంది. సింగిల్ స్క్రీన్ ధరలు రూ.110 నుంచి రూ.145 వరకూ ఉన్నాయి. అంతకు మించి పెంచాలంటే అధికారిక అనుమతి (జీఓ) తీసుకోవాలి. ఇప్పుడు 'హిట్ 3' టీమ్ అదే పనిలో ఉందట. నాని అడిగితే ప్రభుత్వ అనుమతి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
-
Home
-
Menu