'పరాశక్తి' గురించి ముదురుతోన్న వివాదం!

తమిళ లెజెండరీ యాక్టర్ శివాజీ గణేషన్ కి నటుడిగా మంచి పేరు తీసుకొచ్చిన చిత్రం 'పరాశక్తి'. ఈ సినిమా టైటిల్ తోనే ఇప్పుడు ఇద్దరు తమిళ హీరోలు వస్తున్నారు. ఈరోజు ఉదయం ఇదే టైటిల్ తో తన 25వ చిత్రాన్ని ప్రకటించాడు విజయ్ ఆంటోని. ఇప్పుడు మరో స్టార్ శివ కార్తికేయన్ సినిమాకీ 'పరాశక్తి' టైటిల్ ను ప్రకటించారు.
సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా రవి మోహన్ (జయం రవి), అథర్వ, శ్రీలీల ఇతర కీలక పాత్రల్లో రూపొందుతున్న సినిమాకి 'పరాశక్తి' టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ మూవీ టైటిల్ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ లో ఓ స్టూడెంట్ లీడర్ స్టోరీగా ఈ చిత్రం రాబోతుంది. ఈ సినిమాకి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
అయితే 'పరాశక్తి' టైటిల్ ను తాను గతేడాది జూలైలోనే రిజిష్టర్ చేయించినట్టు ఓ నోట్ ను సోషల్ మీడియాలో విడుదల చేశాడు విజయ్ ఆంటోని. ఆ నోట్ ను జారీ చేసింది సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. మరి.. అదే టైటిల్ తో వస్తోన్న శివ కార్తికేయన్ టీమ్ ఈ వివాదం గురించి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో చూడాలి.
-
Home
-
Menu