‘ది గర్ల్‌ఫ్రెండ్’ రెండో పాటకు రెడీ

‘ది గర్ల్‌ఫ్రెండ్’ రెండో పాటకు రెడీ
X
నేషనల్ క్రష్ రష్మిక లేటెస్ట్ మూవీ 'ది గర్ల్‌ఫ్రెండ్'. లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు.

నేషనల్ క్రష్ రష్మిక లేటెస్ట్ మూవీ 'ది గర్ల్‌ఫ్రెండ్'. లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రం తెరకెక్కుతుంది.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘నదివే...’ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. లేటెస్ట్ గా సెకండ్ సింగిల్ ‘ఏం జరుగుతోంది...’ ఆగస్టు 26న విడుదల కానుంది. హేషమ్ అబ్దుల్ వాహెబ్ సంగీతంలో రాకేందు మౌళి రాసిన ఈ పాటను చిన్మయి ఆలపించింది. త్వరలో ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతుంది.



Tags

Next Story