మైత్రీ వారి దృష్టిలో పడ్డ ‘డ్రాగన్’ బాయ్

మైత్రీ వారి దృష్టిలో పడ్డ ‘డ్రాగన్’ బాయ్
2022లో విడుదలైన లవ్ టుడే సినిమాతో ప్రదీప్ రంగనాథన్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని ఆయన దర్శకత్వం వహించడంతో పాటు కథానాయకుడిగా కూడా నటించాడు. ఏజీయస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమా కేవలం 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినా, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల భారీ వసూళ్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది.
ఈ విజయం తర్వాత, ప్రదీప్ ‘డ్రాగన్’ అనే మరో రొమాంటిక్ కామెడీ-డ్రామాలో ప్రధాన పాత్ర పోషించాడు. అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 21, 2025న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే 6 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, కథాంశం ద్వారా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా కథ రఘవన్ ధనపాల్ అనే టాలెంటెడ్ స్టూడెంట్ చుట్టూ తిరుగుతుంది. వ్యక్తిగత సమస్యల కారణంగా తిరుగుబాటు ధోరణిని అవలంభించే అతని ప్రయాణం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది.
ఇక తాజా సమాచారం ప్రకారం... మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ప్రదీప్ రంగనాథన్ ఓ కొత్త సినిమా చేయబోతున్నాడు. ఇది తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం అవ్వడం విశేషం. ఒక డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమాతో మెగాఫోన్ పట్టనుండగా, ఇది ప్రదీప్ కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది. ఇదే సమయంలో, ప్రదీప్ త్వరలో మరో ఆసక్తికరమైన చిత్రంలో కనిపించనున్నాడు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే తమిళ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీలో ప్రదీప్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. సో.. మొత్తానికి ప్రదీప్ వరుస విజయాలతో దూసుకుపోతూ, కొత్త కొత్త ప్రాజెక్టులతో తన ప్రయాణాన్ని మరింత ఆసక్తికరంగా కొనసాగిస్తున్నాడు.
-
Home
-
Menu