‘బాస్ పండగకు వస్తున్నాడు’ – అనిల్ రావిపూడి

‘బాస్ పండగకు వస్తున్నాడు’ – అనిల్ రావిపూడి
X
మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమాకు ‘మన శంకరవరప్రసాద్‌గారు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈరోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమాకు ‘మన శంకరవరప్రసాద్‌గారు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈరోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో చిరంజీవి సూట్ వేసుకుని సిగరెట్ తాగుతూ స్టైలిష్‌గా కనిపించడం అభిమానుల్లో హైప్‌ను పెంచింది.

హైదరాబాద్ ప్రసాద్స్ లో జరిగిన ఈ మెగా గ్లింప్స్ లాంఛింగ్ ఈవెంట్ లో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘ఈ గ్లింప్స్‌తో సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చాను. నేను చిన్నప్పటి నుంచీ చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన నటించిన ‘రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు‘ నాకు చాలా ఇష్టమైన సినిమాలు. మీరు మెగాస్టార్‌ను ఎలా చూడాలనుకుంటారో, దానికి రెండింతలు ఈ సినిమాలో కనిపిస్తారు. పాటలు, వినోదం, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ అద్భుతంగా వచ్చాయి. ఆయన అసలు పేరు శివశంకర వరప్రసాద్‌ను మార్చి టైటిల్ పెట్టాం. టైటిల్ గ్లింప్స్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు వెంకటేష్ గారికి థాంక్స్. త్వరలోనే ఆయన సినిమాలో కూడా కనిపిస్తారు. చిరంజీవి–వెంకటేష్ కాంబినేషన్ సంక్రాంతికి పెద్ద సర్‌ప్రైజ్ అవుతుంది‘ అన్నారు.

అలాగే ఈ సినిమాలో ‘చిరంజీవి లుక్ మొత్తం ఒరిజినల్‌. వీఎఫ్ఎక్స్ చాలా తక్కువ వాడాం, 5 శాతం కూడా ఉండదు. చిరంజీవి ఈ లుక్ కోసం చాలా కష్టపడ్డారు. జిమ్‌కి వెళ్లి సన్నబడ్డారు. ఈ లుక్‌ను పెద్ద తెరపై చూడటం అభిమానుల కోసం ఫెస్టివల్ లాంటిది. బాస్ పండగకు వస్తున్నాడు‘ అని భావోద్వేగంగా తెలిపాడు అనిల్ రావిపూడి.

Tags

Next Story