భారత చరిత్రలోనే అత్యంత భారీ చిత్రం!

బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రామాయణ’ సినిమా గురించి ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాగ్నం ఓపస్‌ను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. తొలి భాగాన్ని రూ.900 కోట్లతో, రెండో భాగాన్ని రూ.700 కోట్లతో నిర్మిస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మొత్తంగా రూ.1600 కోట్ల బడ్జెట్‌తో ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా నిలవబోతోంది.
ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యశ్ నటిస్తున్నారు. హనుమంతుడిగా సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నారు. ఇప్పటికే మొదటి భాగం షూటింగ్ పూర్తయింది. 2026 దీపావళికి తొలి భాగాన్ని, 2027 దీపావళికి రెండో భాగాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ గ్రాండ్ విజువల్ వండర్ కోసం 10వేల మంది నటీనటులు, టెక్నీషియన్స్ పని చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇందులో హాలీవుడ్ స్థాయి వీఎఫ్ఎక్స్, సెట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతున్నాయి. ‘రామాయణం మన వాస్తవం.. మన చరిత్ర’ అనే థీమ్‌తో రూపొందుతున్న ఈ సినిమా నేటి తరం ప్రేక్షకులకు భారతీయ ఇతిహాసాన్ని వినూత్నంగా అందించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
-
Home
-
Menu