‘ది బెంగాల్ ఫైల్స్‘ టీజర్

‘ది బెంగాల్ ఫైల్స్‘ టీజర్
X
‘ది కశ్మీర్ ఫైల్స్, ది తాష్కెంట్ ఫైల్స్’ వంటి సంచలన చిత్రాలతో దేశాన్ని కదిలించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, తాజాగా ‘ది బెంగాల్ ఫైల్స్ తో వస్తున్నాడు.

‘ది కశ్మీర్ ఫైల్స్, ది తాష్కెంట్ ఫైల్స్’ వంటి సంచలన చిత్రాలతో దేశాన్ని కదిలించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, తాజాగా ‘ది బెంగాల్ ఫైల్స్ తో వస్తున్నాడు. ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 5న విడుదలకానున్న ‘ది బెంగాల్ ఫైల్స్‘ టీజర్ రిలీజయ్యింది.

టీజర్ విషయానికొస్తే.. ‘నేను కాశ్మీరీ పండిట్‌ని... బెంగాల్ మరో కాశ్మీర్ అవుతోంది‘ అనే డైలాగ్ తో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా బెంగాల్‌లోని చారిత్రక సంఘటనలను, అక్కడి అల్లర్లను కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నట్టు తెలుస్తోంది.

ముందుగా ఈ సినిమాను ‘ది ఢిల్లీ ఫైల్స్: ది బెంగాల్ చాప్టర్’ అనే పేరుతో రూపొందించగా, చివరకు ‘బెంగాల్ ఫైల్స్‘గా మార్చాడు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ఈ సినిమాకి వివేక్ అగ్నిహోత్రితో పాటు టాలీవుడ్ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.



Tags

Next Story