'కింగ్డమ్'లో ఆ సీన్ హైలైట్!

కింగ్డమ్లో ఆ సీన్ హైలైట్!
X
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. జూలై 31న పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతుంది.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. జూలై 31న పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈనేపథ్యంలో సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ లో స్పీడు పెంచారు మేకర్స్. లేటెస్ట్ గా హీరో విజయ్, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి లతో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఓ స్పెషల్ ఇంటర్యూ చేశాడు.

ఈ సందర్భంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ఇప్పటికే తాను కొంత మేరకు సినిమా చూశానని.. 'సినిమా మాడ్‌గా ఉంది. RR లేకపోయినా లీనమయ్యా. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచుతుంది' అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. విజయ్‌ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, మూడు డిఫరెంట్ గెటప్స్, అదిరే లుక్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయట.

ఇక ఈ సినిమాలోని ఓ కీలక సన్నివేశం గురించి డైరెక్టర్ గౌతమ్ వివరించాడు. ఈ చిత్రం కోసం శ్రీలంకలోని 200 ఏళ్ల నాటి జైల్లో చిత్రీకరించిన సన్నివేశాలు ఎంతో హైలైట్ గా ఉంటాయట. 30 నిమిషాల వర్షంలో ఆ సాగే జైలు ఎపిసోడ్ ఎంతో ఆకట్టుకుంటుందని డైరెక్టర్ గౌతమ్ తెలిపాడు. మొత్తంగా 140 రోజుల షూటింగ్‌లో 40 రోజులు శ్రీలంకలోనే చిత్రీకరణ జరిపారట. రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయడం వల్ల విజువల్స్ రిచ్‌గా కనిపిస్తాయని చెప్పాడు డైరెక్టర్.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన 'కింగ్డమ్' హిందీలో 'సామ్రాజ్య' పేరుతో రిలీజవుతుంది. ఈరోజు తిరుపతిలో గ్రాండ్ లెవెల్ లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. జూలై 28న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.



Tags

Next Story