నా కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ గా తండేల్ అవుతుంది: నాగ చైతన్య

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం "తండేల్".చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.అలానే రాక్ స్టార్ డిఎస్పీ సంగీతాన్ని అందించారు.ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.ఈ సందర్భంగా హీరో అక్కినేని నాగచైతన్య విలేకరుల సమావేశంలో ‘తండేల్’ విశేషాలు పంచుకున్నారు.
నాగ చైతన్య మాట్లాడుతూ.."నా కెరీర్ లో బిగ్గెస్ట్ ప్రొడక్షన్, హై బడ్జెట్ మూవీగా ' వస్తుంది.ఆల్రెడీ సినిమా చూశాం. చాలా కాన్ఫిడెంట్ గా వున్నాం. నాకు కూడా ఎమోషనల్ హై ఇచ్చింది. చివరి ముఫ్ఫై నిమిషాలు వెరీ సాటిస్ఫాక్షన్. క్లైమాక్స్ గ్రేట్ ఎమోషనల్ హై ఇస్తుంది.పాత్రకు తగ్గట్టుగా మారాలంటే వాళ్ళ లైఫ్ స్టయిల్ తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి వాళ్ళని నేరుగా కలవాలి కాబట్టి వాళ్ళని వెళ్లి కలవడం జరిగింది.దాదాపు ఎనిమిది నెలలు స్క్రిప్ట్, నా ట్రాన్స్ ఫర్మేషన్ మీదే వున్నాను. శ్రీకాకుళం యాస గురించి ట్యూషన్ తీసుకున్నాను. యాస రియల్లీ ఛాలెజింగ్ గా అనిపించింది.
పల్లవి ఫెంటాస్టిక్ యాక్టర్. పల్లవితో యాక్ట్ చేయడం ఇష్టం. తనలో మంచి పాజిటివ్ ఎనర్జీ వుంటుంది. క్యారెక్టర్ ని డీప్ గా అర్ధం చేసుకుంటుంది. ఒక ఆర్టిస్ట్ అలా వున్నప్పుడు మన పెర్ఫార్మెన్స్ కూడా రెట్టింపు అవుతుంది.సాయి పల్లవితో డ్యాన్స్ చేయాలంటే కష్టపడాలి. అయితే చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాం.మా ఇద్దరి మధ్య ఒక సాంగ్ థీమ్ కూడా శివ పార్వతుల లవ్ స్టొరీ మీద వుంటుంది. మా క్యారెక్టర్స్ కూడా సినిమాలో శివ పార్వతుల నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు" అని చెప్పారు.
-
Home
-
Menu