‘తండేల్‘ తమిళ ట్రైలర్ కోసం స్టార్ డైరెక్టర్స్!

‘తండేల్‘ తమిళ ట్రైలర్ కోసం స్టార్ డైరెక్టర్స్!
X
పాన్ ఇండియా సినిమాల ప్రమోషన్స్ ను నిర్వహించడానికి పెద్ద ప్రణాళిక కావాలి. కేవలం ఒక భాషలోనే కాకుండా సినిమా విడుదలయ్యే అన్ని భాషల్లోనూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ‘తండేల్‘ కోసం అదే పనిలో ఉంది టీమ్.

పాన్ ఇండియా సినిమాల ప్రమోషన్స్ ను నిర్వహించడానికి పెద్ద ప్రణాళిక కావాలి. కేవలం ఒక భాషలోనే కాకుండా సినిమా విడుదలయ్యే అన్ని భాషల్లోనూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ‘తండేల్‘ కోసం అదే పనిలో ఉంది టీమ్. ఇటీవల వైజాగ్ లో ‘తండేల్‘ తెలుగు ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు చెన్నైలో తమిళ ట్రైలర్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈరోజు సాయంత్రం చెన్నైలోని లీల ప్యాలెస్ లో ‘తండేల్‘ తమిళ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరగబోతుంది. అందుకోసం ఇప్పటికే మూవీ టీమ్ చెన్నై వెళ్లింది. ‘తండేల్‘ తమిళ ట్రైలర్ ను లాంఛ్ చేసేందుకు కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు, కార్తీక్ సుబ్బరాజ్ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. వీరిలో వెంకట్ ప్రభుతో నాగచైతన్య ‘కస్టడీ‘ సినిమా చేసిన సంగతి తెలిసిందే.

ఇక వైజాగ్ ఈవెంట్ కి మిస్సైన సాయి పల్లవి కూడా ఈరోజు చెన్నై ఈవెంట్ లో సందడి చేసే అవకాశం ఉంది. మొత్తంగా.. ఫిబ్రవరి 7న విడుదల కాబోతున్న ‘తండేల్‘ చిత్రం కోసం బెంగళూరు, కోచ్చి, ముంబై వంటి ప్రాంతాల్లోనూ ప్రచార కార్యక్రమాలు జరపడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తుందట.

Tags

Next Story