'తండేల్' మూవీ ట్విట్టర్ రివ్యూ!

నాగచైతన్య మోస్ట్ అవైటింగ్ మూవీ 'తండేల్' ఈరోజు థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఇప్పటికే అమెరికాలో ఈ సినిమాకి ప్రీమియర్స్ పడ్డాయి. సోషల్ మీడియా వేదికగా 'తండేల్' సినిమాకి సంబంధించి సమీక్షలు హల్ చల్ చేస్తున్నాయి. ఓవరాల్ గా 'తండేల్' చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.
ఫస్టాఫ్ లో స్లో నేరేషన్ కాస్త ఇబ్బంది పెట్టినా.. ఆ తర్వాత స్టోరీ రేసీగా వెళుతుందనే రివ్యూస్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ లో రాజు (నాగచైతన్య), సత్య (సాయిపల్లవి) మధ్య లవ్ స్టోరీ బాగుందని.. అయితే కొన్ని సన్నివేశాలు రొటీన్ గా అనిపిస్తాయని ట్వీట్స్ చేస్తున్నారు సినిమా చూసిన వాళ్లు. ఇక రాజు పాత్రలో నాగచైతన్య మేకోవర్ కి మంచి మార్కులు పడుతున్నాయి. సత్య గా సాయిపల్లవి తనదైన నేచురల్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టిందనే ప్రశంసలు వినిపిస్తున్నాయి.
ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుందని.. సెకండాఫ్ లో పేట్రియాటిజమ్ గురించి వచ్చే సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయని ట్విట్టర్ రివ్యూస్ వస్తున్నాయి. సెకండాఫ్ లో పాకిస్తాన్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఆర్టిఫీషియల్ గా అనిపించినా.. చివరి 20 నిమిషాల బ్లాక్ బాగుందనే రివ్యూస్ వస్తున్నాయి.
ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం బ్యాక్‌బోన్ అని వినిపిస్తుంది. ప్రేమకథా చిత్రాలకు ప్రత్యేకమైన మ్యూజిక్ కంపోజ్ చేసే డి.ఎస్.పి. 'తండేల్' కోసం పాటలే కాదు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడనే ప్రశంసలు వస్తున్నాయి. 'హైలెస్సో, బుజ్జి తల్లి, నమో నమఃశివాయ' పాటలు విజువల్ గానూ చాలా బాగున్నాయనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. మొత్తంగా 'తండేల్' సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.
-
Home
-
Menu