సక్సెస్ టూర్ లో 'తండేల్' మూవీ టీమ్!

సక్సెస్ టూర్ లో తండేల్ మూవీ టీమ్!
X
యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన 'తండేల్' చిత్రానికి థియేటర్లలో ట్రెమండస్ రెస్పాన్స్ దక్కుతుంది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో, స్ట్రాంగ్ నేరేటివ్‌తో ప్రేక్షకుల మనసులను దోచుకుంటోంది.

యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన 'తండేల్' చిత్రానికి థియేటర్లలో ట్రెమండస్ రెస్పాన్స్ దక్కుతుంది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో, స్ట్రాంగ్ నేరేటివ్‌తో ప్రేక్షకుల మనసులను దోచుకుంటోంది. చైతన్య, సాయి పల్లవి పెయిర్, చందు మొండేటి డైరెక్షన్, దేవిశ్రీప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతానికి మంచి రెస్పాన్స్ దక్కుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా అమెరికాలో మంచి వసూళ్లను సాధిస్తుంది. ఈ చిత్రం అమెరికాలో హాఫ్ మిలియన్ డాలర్ మార్క్‌ను దాటి, 6 లక్షల డాలర్ల వసూళ్ల దిశగా వేగంగా దూసుకెళ్తోంది. వీకెండ్ ముగిసేలోపు 1 మిలియన్ మార్క్‌ను చేరే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వసూళ్లు దక్కుతున్నాయి. విడుదలైన తొలి రోజు రూ.21 కోట్లు వసూళ్లు సాధించిన ఈ సినిమా రెండు రోజుల్లో మొత్తం 41.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

'తండేల్' సక్సెస్ నేపథ్యంలో చిత్రబృందం ఈరోజు సక్సెస్ టూర్ నిర్వహిస్తుంది. ఈరోజు వరుసగా విజయవాడ, ఏలూరు, రాజమండ్రిలలో చిత్రబృందం సందడి చేయబోతుంది.

Tags

Next Story