డబ్బింగ్ స్టూడియోలో సాయి పల్లవి అల్లరి!

'తండేల్' సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు చిత్ర యూనిట్ మరో స్థాయిలో నిర్వహిస్తోంది. చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రచారంలో స్పీడు పెంచింది టీమ్. ఈరోజు 'తండేల్' నుంచి మోస్ట్ అవైటింగ్ ట్రైలర్ రాబోతుంది.
తాజాగా 'తండేల్' కోసం సాయి పల్లవి డబ్బింగ్ చెబుతున్న వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తనకు జ్వరం, కోల్డ్ ఉన్నప్పటికీ సాయి పల్లవి ఈ సినిమాకోసం ఎంతో డెడికేటెడ్ గా డబ్బింగ్ చెప్పిందట. అలాగే డైరెక్టర్ చందూ మొండేటి, సాయి పల్లవి మధ్య జరిగిన సరదా ర్యాగింగ్ కు సంబంధించి అల్లరి ఈ వీడియోలో హైలైట్ గా ఉంది.
గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న 'తండేల్' చిత్రంపై మంచి బజ్ ఉంది. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలు, దేవిశ్రీప్రసాద్ సంగీతంలో వచ్చిన పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. సినిమా అవుట్ పుట్ పైనా మూవీ టీమ్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉందట. మరి.. నాగచైతన్య పాన్ ఇండియా లెవెల్ లో 'తండేల్'తో హిట్ కొడతాడేమో చూడాలి.
-
Home
-
Menu