‘తెలుసు కదా‘ టీజర్ రిలీజ్

X
స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘తెలుసు కదా’. ఈ సినిమాను ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన రూపొందిస్తుంది.
స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘తెలుసు కదా’. ఈ సినిమాను ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన రూపొందిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ‘మల్లిక గంధ‘ లిరికల్ సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యింది. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ రిలీజయ్యింది.
హీరోహీరోయిన్లు సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి మధ్య ట్రయాంగులర్ లవ్ స్టోరీగా ‘తెలుసు కదా‘ టీజర్ ఆకట్టుకుంటుంది. ‘టిల్లు‘ సిరీస్ తో రొమాంటిక్ ఇమేజ్ ను సంపాదించుకున్న సిద్ధు జొన్నలగడ్డకు ‘తెలుసు కదా‘ మరో పర్ఫెక్ట్ మూవీ అవుతుందని టీజర్ ను బట్టి తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అక్టోబర్ 17న తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో ‘తెలుసు కదా‘ విడుదలవుతుంది.
Next Story
-
Home
-
Menu