మలయాళీ రీమేక్ తో తరుణ్ భాస్కర్

దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన శైలి ఏర్పరచుకున్న తరుణ్ భాస్కర్.. నటుడిగానూ విలక్షణతను చాటుతున్నాడు. లేటెస్ట్ గా తరుణ్ భాస్కర్ హీరోగా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 1న థియేటర్లలోకి రానుంది.
లేటెస్ట్ గా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ మోషన్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో అంబటి ఓంకార్ నాయుడు అనే వాన్ డ్రైవర్‌గా తరుణ్, కొండవీటి ప్రశాంతిగా ఈషా రెబ్బా కనిపించనున్నారు. ఈ చిత్రం మలయాళ హిట్ మూవీ ‘జయ జయ జయహే’కి అఫీషియల్ రీమేక్.
ఏఆర్ సజీవ్ ఈ చిత్రాన్ని ఆద్యంతం గ్రామీణ నేపథ్యంలో రూపొందిస్తున్నారు. బ్రహ్మానందం, బ్రహ్మాజీ, గోపరాజు విజయ్, శివన్నారాయణ, బిందు చంద్రమౌళి వంటి నటులు సహాయ పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వర్స్ స్టూడియోస్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
#OmShantiShantiShantihi it is ❤️🔥
— MovieVerse Studios (@MovieVerseIndia) July 5, 2025
A world full of vibrance, fun and chaos awaits you 💥💥#OSSS - 𝐈𝐧 𝐭𝐡𝐞𝐚𝐭𝐫𝐞𝐬 𝐭𝐡𝐢𝐬 𝐦𝐨𝐧𝐬𝐨𝐨𝐧 - 𝐀𝐮𝐠𝐮𝐬𝐭 𝟏𝐬𝐭, 𝟐𝟎𝟐𝟓 ❤️#TharunBhascker @yourseesha @ActorBrahmaji @ARSajeev2794 @jaymkrish @srujanyarabolu1 @in10_media… pic.twitter.com/PTBxN9Snzq
-
Home
-
Menu