‘మాస్ జాతర’ రిలీజ్ పై సస్పెన్స్?

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్‌గా రూపొందిన చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకుడు. రవితేజ అంటేనే మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ. యాక్షన్, కామెడీ, పంచ్ డైలాగ్స్‌తో మాస్ రాజా సినిమాలు ప్రేక్షకులకు మాస్ ఫెస్టివల్‌లా ఉంటాయి. ఇక ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో 'మాస్ జాతర' కూడా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టబోతుందని అర్థమయ్యింది.
వినాయకచవితి కానుకగా ఆగస్టు 27న 'మాస్ జాతర' రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. కానీ.. ఆ సమయానికి ఈ సినిమా రావడం కష్టమే అనే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. సినిమా అవుట్‌పుట్ విషయంలో మేకర్స్ పూర్తి సంతృప్తి చెందలేదట. క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ ఫైనల్ కాపీ సిద్ధమైన తర్వాతే రిలీజ్ చేయాలని నిర్మాత నాగవంశీ భావిస్తున్నారట. అందుకే వాయిదా తప్పదనే చర్చ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మరోవైపు ఈ చిత్రం కొత్త విడుదల తేదీ కోసం సెప్టెంబర్ 12ను పరిశీలిస్తున్నారట. త్వరలోనే 'మాస్ జాతర' కొత్త తేదీపై క్లారిటీ ఇవ్వనుందట సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.
-
Home
-
Menu