స్టైలిష్ లుక్ లో సూర్య!

కోలీవుడ్ స్టార్ సూర్య బర్త్ డే స్పెషల్ గా ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా అందించాడు. వాటిలో ఒకటి ఆర్.జె.బాలాజీ డైరెక్షన్ లో రూపొందుతున్న 'కరుప్పు' టీజర్ కాగా.. మరొకటి తన 46వ చిత్రం ఫస్ట్ లుక్.
సూర్య కెరీర్‌లో 46వ చిత్రాన్ని తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది. ఈ లుక్ లో స్టైలిష్, యంగ్ వింటేజ్ లుక్‌లో కనిపించిన సూర్య పోస్టర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రంలో సూర్య సరసన మమితా బైజు కథానాయికగా నటిస్తుండగా, రవీనా టాండన్, రాధిక శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. వెంకీ అట్లూరి ఇప్పటికే ‘సార్, లక్కీ భాస్కర్’ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న నేపథ్యంలో, సూర్యతో చేస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రత్యేకంగా తెలుగులో ఈ సినిమా రూపొందుతుండటం, సూర్య స్ట్రెయిట్ తెలుగు సినిమాతో రాబోతుండటంటో తెలుగు అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు.
-
Home
-
Menu