దర్శన్ బెయిల్‌పై సుప్రీంకోర్టు అసంతృప్తి

రేణుకాస్వామి హత్యకేసులో నిందితుడిగా ఉన్న ప్రముఖ కన్నడ నటుడు దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్‌పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గతేడాది అక్టోబర్‌లో మధ్యంతర బెయిల్ పొందిన దర్శన్‌కు, డిసెంబర్ 13న రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. అయితే ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు తన విచక్షణాధికారాన్ని సరిగ్గా వినియోగించలేదని అభిప్రాయపడింది. 'అది న్యాయబద్ధంగా తీసుకోలేని తీర్పుగా అనిపిస్తోంది' అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
హైకోర్టు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించిన తీరుతో తాము ఏకీభవించలేకపోతున్నామని ధర్మాసనం పేర్కొంది. 'బెయిల్‌పై ఎందుకు జోక్యం చేసుకోకూడదు?' అంటూ ప్రశ్నించిన సుప్రీం, కేసు తీవ్రతను, బాధితుడి హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పు వెలువరించిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
దర్శన్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది కపిల్ సిబల్ – కేసులో ఉన్న సాక్షుల వాంగ్మూలాలపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ వాదనలపై తదుపరి విచారణను జూలై 22కి వాయిదా వేసింది. అంతకుముందు ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడతో పాటు మరో 15మంది అరెస్ట్ అయ్యారు. వీరిలో కొందరికి ఇప్పటికే బెయిల్ లభించింది.
ఇదిలా ఉండగా, బెయిల్‌పై విడుదలైన దర్శన్ తన ‘డెవిల్’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. విదేశాల్లో చిత్రీకరణ కోసం దిగువ కోర్టు అనుమతినీ మంజూరు చేసింది.
-
Home
-
Menu