కన్నడలో 'థగ్ లైఫ్'పై సుప్రీంకోర్టు క్లారిటీ!

కన్నడలో థగ్ లైఫ్పై సుప్రీంకోర్టు క్లారిటీ!
X
కమల్ హాసన్ నటించిన 'థగ్ లైఫ్' చిత్రం కర్ణాటకలో విడుదలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే సెన్సార్ సర్టిఫికెట్ పొందిన సినిమాను ఆపడం చట్ట విరుద్ధమని తెలిపింది.

కమల్ హాసన్ నటించిన 'థగ్ లైఫ్' చిత్రం కర్ణాటకలో విడుదలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే సెన్సార్ సర్టిఫికెట్ పొందిన సినిమాను ఆపడం చట్ట విరుద్ధమని తెలిపింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోలేదని కర్ణాటక ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

కమల్ హాసన్ గతంలో చేసిన 'కన్నడ తమిళం నుండే పుట్టింది' వ్యాఖ్యలు వివాదాస్పదమవ్వడంతో, కర్ణాటకలోని కొంతమంది కన్నడ సంఘాలు సినిమాను విడుదల చేయకుండా ఆపాయి. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా నిషేధానికి పరోక్షంగా మద్దతు తెలిపింది. దీంతో జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన 'థగ్ లైఫ్' కర్ణాటకలో ప్రదర్శనకు నోచుకోలేదు.

ఈ నేపథ్యంలో, ప్రజాస్వామ్యంలో సీబీఎఫ్‌సీ అనుమతి ఉన్న సినిమా ప్రదర్శనకు భద్రత కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని కోర్టు ఘాటుగా పేర్కొంది. క్షమాపణ చెప్పాలంటూ కమల్ హాసన్‌ను కోరిన కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యలపై కూడా సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. 'వ్యాఖ్యలు తప్పుగా అర్థమయ్యాయి. కన్నడ భాషపై గౌరవం ఉంది' అని కమల్ హాసన్ వ్యాఖ్యానించినా, క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు.

Tags

Next Story