‘స్పిరిట్’లో సూపర్ నేచురల్ ట్విస్ట్?

‘స్పిరిట్’లో సూపర్ నేచురల్ ట్విస్ట్?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించబోయే “స్పిరిట్” సినిమాపై ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా పవర్‌ఫుల్ పోలీస్ యాక్షన్ డ్రామాగా వస్తుందని ముందే చెప్పినా, తాజాగా ఇది సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కలిగిన కథ అని టాక్ వినిపిస్తోంది.

ప్రభాస్ ఒక రా అండ్ రస్టిక్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి, ఓ ఛాలెంజింగ్ కేస్ దర్యాప్తు చేస్తూ వెళుతాడు. ఆ క్రమంలో అతీంద్రియ శక్తులు వెనుక ఉన్నాయన్న విషయం నేపథ్యంలో కథ సాగుతుందనే ప్రచారం ఉంది. అందుకే “స్పిరిట్” అనే టైటిల్ పెట్టారని అంటున్నారు.

హీరోయిన్‌గా తొలుత దీపిక పదుకొణె పేరు వినిపించినా, చివరికి తృప్తి దిమ్రి ఫైనల్ అయ్యింది. ఈ ఏడాదిలోనే షూటింగ్ మొదలు కానుండగా, సంగీతాన్ని హర్ష వర్ధన్ రామేశ్వర్ అందించబోతున్నాడు.

ఇప్పటికే ప్రభాస్ “రాజా సాబ్”తో హారర్ మూవీ చేస్తున్నందున వెంటనే మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్ చేయాలా? అనే సందేహం ఫ్యాన్స్‌లో ఉంది. అయితే ఇవన్నీ అధికారికంగా నిర్ధారణ కాలేదు. కానీ బాలీవుడ్ నుంచి వస్తున్న ఈ రూమర్స్ మాత్రం అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి.

Tags

Next Story