ఒక్కరోజులో రాజీనామా చేసిన సునీల్!

టాలీవుడ్లో థియేటర్ల బంద్, డిస్ట్రిబ్యూటర్ల మధ్య అభిప్రాయ భేదాలు, పర్సెంటెజ్ వివాదాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో, తాజాగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ రాజీనామా చేయడం సంచలనం రేపుతోంది.
విశేషం ఏమిటంటే, అధ్యక్షుడిగా ఎన్నికైన సునీల్ నారంగ్ ఎన్నికైన 24 గంటల వ్యవధిలోనే రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ విడుదల చేశారు. తన ప్రమేయం లేకుండా, తన పేరు ఉపయోగించి పబ్లిక్ స్టేట్మెంట్లు ఇస్తున్నారని, ఇలాంటి వ్యవహారాల్లో తనను ఇన్వాల్వ్ చేయడం నచ్చడం లేదని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం అసాధ్యమని, అందుకే తక్షణమే రాజీనామా చేస్తున్నానని తెలిపారు.
ఇప్పటికే థియేటర్ల బంద్, హరిహర వీరమల్లు వివాదం, నిర్మాతలు – ఎగ్జిబ్యూటర్ల మధ్య ఏర్పడిన సమస్యలు పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పైగా, ఫిలిం ఛాంబర్ సభ్యుల మధ్య ఐక్యత లేకపోవడం, తాజా ప్రెస్ మీట్లో TFCC సెక్రటరీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు – ఇవన్నీ సునీల్ నారంగ్ తీసుకున్న నిర్ణయానికి కారణమైనట్టు తెలుస్తోంది.
-
Home
-
Menu