రొమాంటిక్ మెలోడీతో 'సుందరకాండ'

నారా రోహిత్ మైల్ స్టోన్ 20వ సినిమాగా 'సుందరకాండ' రాబోతుంది. వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది. నారా రోహిత్ కి జోడీగా శ్రీదేవి విజయ్‌కుమార్, వృతి వాఘాని కథానాయికలుగా నటించారు. సీనియర్ నరేష్, అభినవ్ గోమఠం, వాసుకి ఆనంద్, సత్య, అజయ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి తెరకెక్కించిన ఈ మూవీని సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ లో ఇప్పటికే వచ్చిన గీతాలకు మంచి స్పందన రాగా.. లేటెస్ట్ గా ‘డియర్ ఐరా’ అంటూ సాగే రొమాంటిక్ మెలోడీ రిలీజయ్యింది.
శ్రీ హర్ష ఈమని రాసిన ఈ పాటను లియోన్ జేమ్స్, కీర్తన వైద్యనాథన్ ఆలపించారు. హీరోహీరోయిన్లు నారా రోహిత్, వృతి వాఘాని మధ్య చిత్రీకరించిన ఈ మాంటేజ్ సాంగ్ ఆకట్టుకుంటుంది. మొత్తంమీద.. మిడిల్ ఏజ్ లో మ్యారేజ్ అనే కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ మూవీ రోహిత్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
-
Home
-
Menu