సుకుమార్ పైనే చెర్రీ ఫ్యూచర్ భారం!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కిట్టీలో ప్రస్తుతం RC16, RC17 సినిమాలున్నాయి. వీటితో పాటు 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని నిర్మించిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై చరణ్ మరో సినిమా చేయబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతుంది. అయితే లేటెస్ట్ గా ఆ న్యూస్ పై చెర్రీ టీమ్ క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం చరణ్ కిట్టీలో RC16, RC17 సినిమాలు మాత్రమే ఉన్నాయని.. మరో కొత్త సినిమాకి కమిట్ అవ్వలేదని చెర్రీ టీమ్ ఇచ్చిన క్లారిటీ. ఇక RC16 విషయానికొస్తే లేటెస్ట్ గా ఈ మూవీ కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతుంది. ఇప్పటికే మైసూర్ లో కొంత భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
RC16లో స్పోర్ట్స్ మ్యాన్ గా కనిపించబోతున్నాడు చరణ్. అతనికి గురువు పాత్రలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కనిపించనున్నాడట. ఈ మూవీలో చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంది. జగపతిబాబు మరో కీ రోల్ లో కనిపించనున్నాడు. ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
RC16 చిత్రాన్ని నిర్మిస్తున్న క్రియేటివ్ జీనియస్ RC17కి దర్శకత్వం వహించబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ లోనే RC17 తెరకెక్కనుంది. మొత్తంగా 'గేమ్ ఛేంజర్'తో డీలాపడ్డ చరణ్ ను మళ్లీ ట్రాక్ లోకి తీసుకొచ్చే బాధ్యత క్రియేటివ్ జీనియస్ సుకుమార్ పైనే ఉంది.
-
Home
-
Menu