పైరసీపై కఠిన చర్యలు – దిల్ రాజు

తెలుగు సినీ పరిశ్రమలో పైరసీపై కఠిన చర్యలు చేపట్టనున్నట్లు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. తాజాగా ఎఫ్‌డీసీ ఎండీ సిహెచ్. ప్రియాంకతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ఉప ముఖ్యమంత్రితో పలు సమావేశాలు జరిగాయని, ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ రూపుదిద్దుకుంటోందన్నారు.
పైరసీ అరికట్టేందుకు ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని, ఇందులో ఫిల్మ్ ఛాంబర్, సైబర్ సెల్, పోలీస్ శాఖల ప్రతినిధులు ఉండబోతున్నారని చెప్పారు. సినిమా షూటింగ్‌లకు ఆన్లైన్ అనుమతి ప్రొసెస్‌ను ప్రవేశపెట్టడమే కాకుండా, వీడియో పైరసీ నియంత్రణకు చర్యలు తీసుకుంటామని వివరించారు.
ఎఫ్‌డీసీ ఎండీ ప్రియాంక మాట్లాడుతూ సినిమా జర్నలిస్టుల అక్రిడిటేషన్ అంశాన్ని సమీక్షించనున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీలోని సమస్యలను ఎవరైనా తమ దృష్టికి తీసుకు వస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
-
Home
-
Menu