SSMB29: ప్రియాంక చోప్రా హీరోయినా? విలనా?

SSMB29: ప్రియాంక చోప్రా హీరోయినా? విలనా?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో సినిమాకోసం దశాబ్దానికి పైగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అది ఇప్పుడు వర్కవుట్ అయ్యింది. ఇప్పటికే ముహూర్తాన్ని జరుపుకోవడం, షూటింగ్ మొదలు పెట్టుకోవడం కూడా జరిగింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో సినిమాకోసం దశాబ్దానికి పైగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అది ఇప్పుడు వర్కవుట్ అయ్యింది. ఇప్పటికే ముహూర్తాన్ని జరుపుకోవడం, షూటింగ్ మొదలు పెట్టుకోవడం కూడా జరిగింది. ఈ సినిమాలో మహేష్, ఆ తర్వాత ప్రియాంక చోప్రా.. వీరిద్దరూ తప్ప మిగతా కాస్టింగ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు.


ఈ మూవీలో మహేష్, ప్రియాంక చోప్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారని.. విలన్ గా మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ కనిపించబోతున్నాడనే న్యూస్ అప్పట్లో జోరుగా వినిపిస్తుంది. అయితే.. ఈ మూవీలో పృథ్వీరాజ్‌ ఎంట్రీపై ఇంకా స్పష్టత రాలేదు. అలాగే SSMB29 లో పవర్‌ఫుల్ విలన్ రోల్ కోసం ఇంకా చాలామంది పేర్లు వినిపించాయి.


లేటెస్ట్ గా ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ కాదని.. ఆమె విలన్ రోల్ లో కనిపించబోతుందనే న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. SSMB29లో ప్రియాంక చోప్రా పాత్ర పూర్తి నెగటివ్ షేడ్స్‌లో ఉండనుందనేది ఆ టాక్. మహేష్ బాబుకు గట్టి సవాల్ విసిరే విలన్ పాత్రలో ఆమె కనిపించనున్నట్లు ప్రచారం సాగుతోంది.


రాజమౌళి సినిమాల్లో ప్రతీ పాత్రకూ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా విలన్ పాత్రలు ఆయన చిత్రాల్లో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. మరి SSMB29లో విలన్ రోల్ ను జక్కన్న ఎలా డిజైన్ చేశాడన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ప్రియాంక హీరోయినా లేక విలనా అనే దానిపైనా క్లారిటీ రావాల్సి ఉంది.

Tags

Next Story