శ్రీవిష్ణు కొత్త చిత్రం ప్రారంభం

శ్రీవిష్ణు కొత్త చిత్రం ప్రారంభం
X
శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ‘సామజవరగమణ‘ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇదే కాంబినేషన్ మరోసారి రిపీటవుతోంది.

శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ‘సామజవరగమణ‘ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇదే కాంబినేషన్ మరోసారి రిపీటవుతోంది. దసరా సందర్భంగా వీరిద్దరి కలయికలో కొత్త సినిమా ముహూర్తాన్ని జరుపుకుంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ‘Sree Vishnu x Ram Abbaraju 2’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా ముహూర్తపు వేడుకకు సాయి ధరమ్ తేజ్, నారా రోహిత్, నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్, వివేక్ ఆత్రేయ, హసిత్ గొలి వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ చిత్రానికి కథను భాను భోగవరపు అందిస్తున్నాడు. ‘సామజవరగమన‘ తరహాలోనే ఈ సినిమా కూడా ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందట.



Tags

Next Story