మళ్లీ ఊపందుకున్న శ్రీలీల కెరీర్

మళ్లీ ఊపందుకున్న శ్రీలీల కెరీర్2024లో ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు కొంత స్లంప్ ను ఎదుర్కొన్న శ్రీలీల, ఈ ఏడాది తన దృష్టిని పూర్తిగా కెరీర్‌పైనే కేంద్రీకరించింది. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. సినిమాల పరంగా వరుస ఫ్లాపులు.. ఆపై విడుదలైన "గుంటూరు కారం" సినిమా కి ఎదురైన ట్రోలింగ్‌ను గమనించిన శ్రీలీల.. తనకు మంచి మేకోవర్ అవసరమని గ్రహించింది. ప్రత్యేకంగా సోషల్ మీడియాలో తన ఉనికిని మరింత స్ట్రాంగ్ చేసుకోవాలని నిశ్చయించుకుంది.
ఇందులో భాగంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా మారి నిత్యం ఫోటోషూట్లను షేర్ చేస్తూ, కోట్లాది మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం శ్రీలీల శివ కార్తికేయన్ సరసన తమిళంలో "పరాశక్తి", కార్తిక్ ఆర్యన్ తో బాలీవుడ్‌లో "ఆశికి 3", అలాగే తెలుగులో "రాబిన్ హుడ్" చిత్రంలో నటిస్తోంది. అంతేగాక.. రవి తేజ లేటెస్ట్ మూవీ "మాస్ జాతర" చిత్రీకరణలో బిజీగా ఉంది.
మొత్తానికి శ్రీలీల కెరీర్ వేగంగా ఊపందుకొని ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా మారింది. ఆమె నటిస్తున్న ఈ సినిమాల్లో ఏదైనా సూపర్ హిట్ సాధిస్తే, మరింత భారీ ఆఫర్లు వచ్చే అవకాశముంది. అంతేగాక, రాబోయే రోజుల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, నాని, విజయ్ దేవరకొండ వంటి టాప్ హీరోలతో జోడీ కట్టే అవకాశాల కోసం శ్రీలీల ఎదురుచూస్తోంది.
-
Home
-
Menu