యుద్ధ వీరుడిగా శ్రీకృష్ణ

భగవాన్ శ్రీకృష్ణుడిని ఒక యుద్ధ వీరుని పాత్రలో చూపించబోతున్న చిత్రం ‘శ్రీకృష్ణ అవతార్ ఇన్ మహోబా’. 11వ, 12వ శతాబ్దాల నాటి ‘మహోబా’ సాంస్కృతిక వైభవాన్ని చిత్రంలో ఆవిష్కరించనున్నారట. శ్రీకృష్ణుడి దివ్యత్వం, ధీరత్వం, ఆధ్యాత్మిక ప్రభావం స్ఫురించేలా ఈ సినిమా తెరకెక్కుతుందని చిత్రబృందం చెబుతుంది.
పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ భారీ పౌరాణిక చిత్రానికి ముకుంద్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. అభయ్ చరణ్ ఫౌండేషన్, శ్రీజీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తాజాగా ఇస్కాన్ జితామిత్ర ప్రభు శ్రీ ఆశీస్సులతో నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచస్థాయి సాంకేతిక నిపుణులతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నామని, నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్ గా ఈ మూవీని అనౌన్స్ చేశారు.
-
Home
-
Menu