'ఉస్తాద్..' కోసం స్పెషల్ నంబర్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ షూటింగ్ మళ్లీ జోరందుకుంది. కొంతకాలం బ్రేక్ తర్వాత ఇటీవలే మళ్లీ చిత్రీకరణ ప్రారంభమైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమా కథను దళపతి విజయ్ ‘తెరి’ నుంచి తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే.. ప్రస్తుతం పవన్ ఏపీ డిప్యూటీ సీఎం కావడంతో, కథలో కొన్ని రాజకీయ సమకాలీన అంశాలు జోడించినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దశరథ్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు.
ఈ సినిమా మ్యూజిక్ పరంగా 'గబ్బర్ సింగ్' స్టైల్‌లో మరోసారి మాస్ ఆడియన్స్‌ను ఊపేస్తుందని యూనిట్ భావిస్తోంది. ముఖ్యంగా ‘కెవ్వు కేక’ తరహాలో ఓ పవర్‌ఫుల్ ఐటెం సాంగ్ కోసం దేవి శ్రీ ప్రసాద్ ప్రత్యేకంగా మాస్ ట్యూన్ కంపోజ్ చేస్తున్నాడట. ఈ పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
'హరిహర వీరమల్లు, ఓజీ' సినిమాలతో ఈ ఏడాది రెండు పాన్ ఇండియా రిలీజ్‌లను సిద్ధం చేసిన పవన్ కళ్యాణ్, వచ్చే ఏడాది 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. లేటెస్ట్ గా 'ఉస్తాద్..' సెట్స్ నుంచి పవన్ కళ్యాణ్, శ్రీలీలకు సంబంధించిన సీన్ విజువల్స్ నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.
-
Home
-
Menu