వారం ఆలస్యంగా 'సన్ ఆఫ్ సర్దార్ 2'

బాలీవుడ్ లో సీక్వెల్ చిత్రాలకు ఉన్న క్రేజ్‌కి మరో ఉదాహరణగా ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ నిలవబోతోంది. అజయ్ దేవ్‌గన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని విజయ్ కుమార్ అరోరా తెరకెక్కించారు. 2012లో అజయ్ దేవ్‌గన్ నటించిన హిట్ సినిమా 'సన్ ఆఫ్ సర్దార్'కి సీక్వెల్ గా ఇది రాబోతోంది. తెలుగులో విజయవంతమైన ‘మర్యాద రామన్న’ హిందీ రీమేక్‌గా వచ్చిన ‘సన్ ఆఫ్ సర్దార్’ రూ.161 కోట్లకు పైగా వసూలు చేసి హిట్‌గా నిలిచింది. అందుకే ఈ సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ముందుగా జూలై 25న 'సన్ ఆఫ్ సర్దార్ 2' రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే అనివార్య కారణాల వల్ల వారం పాటు ఆలస్యంగా థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా.. రవి కిషన్, సంజయ్ మిశ్రా, నీరూ బాజ్వా, చంకీ పాండే కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ దక్కింది.
విడుదల వాయిదా వెనుక, ఇటీవల రిలీజ్ అయిన ‘సయ్యారా’ సినిమా ప్రభావమేనని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా విడుదలైన తొలి రోజే రూ.21.25 కోట్ల కలెక్షన్ రాబట్టింది. ఈ నేపథ్యంలోనే ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ వాయిదా పడిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు 'సన్ ఆఫర్ సర్దార్ 2' వాయిదా పాన్ ఇండియా లెవెల్ లో విజయ్ దేవరకొండ 'కింగ్డమ్'కి సవాల్ గా మారనుంది.
-
Home
-
Menu