చిన్న సినిమా.. పెద్ద విజయం!

చిన్న సినిమా.. పెద్ద విజయం!
X
మౌళి తనూజ్ – శివానీ నాగరం జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ 'లిటిల్ హార్ట్స్'. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది.

మౌళి తనూజ్ – శివానీ నాగరం జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ 'లిటిల్ హార్ట్స్'. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై దర్శకుడు సాయి మార్తాండ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఆదిత్య హాసన్ నిర్మించారు.

ప్రమోషన్స్‌తోనే ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేశారు. దానికి తోడు డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ (బీవీ వర్క్స్), వంశీ నందిపాటి (వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్) గ్రాండ్ రిలీజ్ ఇవ్వడంతో, చిన్న సినిమాకు కూడా పెద్ద సినిమాల రేంజ్‌లో ఓపెనింగ్స్ వచ్చాయి.

ప్రీమియర్స్‌ను కేవలం 3 షోలతో ప్రారంభించినా, సాయంత్రానికే అది 29 షోలకు పెరిగింది. థియేటర్ల దగ్గర హౌస్‌ఫుల్ బోర్డులు కనబడటం టీమ్‌కు నమ్మశక్యం కాని ఆనందం ఇచ్చింది. ప్రత్యేకంగా యూత్, కాలేజ్ స్టూడెంట్స్ ఈ సినిమాను తమ ఫ్రెండ్స్‌తో వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి.. లాంగ్ రన్ లో 'లిటిల్ హార్ట్స్' ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.

Tags

Next Story