ఫిబ్రవరి రిలీజెస్ లో స్మాల్ ఛేంజెస్!

X
ఫిబ్రవరి నెలలో ప్రతీ వారం బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి కొనసాగనుంది. అయితే ఈనెలలో రావాల్సిన రెండు చిత్రాల విడుదల విషయంలో స్మాల్ ఛేంజెస్ జరిగే అవకాశాలున్నాయట.
ఫిబ్రవరి నెలలో ప్రతీ వారం బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి కొనసాగనుంది. అయితే ఈనెలలో రావాల్సిన రెండు చిత్రాల విడుదల విషయంలో స్మాల్ ఛేంజెస్ జరిగే అవకాశాలున్నాయట.'క' విజయంతో ఫామ్ లో ఉన్న కిరణ్ అబ్బవరం నుంచి 'దిల్ రూబా' సినిమా వస్తోంది. ఈ సినిమా ప్రేమికులరోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదల తేదీ ఖరారు చేసుకుంది.
వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఇప్పటికే పలు సినిమాలు ఉన్న నేపథ్యంలో 'దిల్ రూబా'ని ఒక వారం ఆలస్యంగా ఫిబ్రవరి 21న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. మరోవైపు ఫిబ్రవరి 21న రావాల్సిన సందీప్ కిషన్ 'మజాకా' చిత్రాన్ని మహాశివరాత్రి స్పెషల్ గా ఫిబ్రవరి 26న విడుదల చేసే ఆలోచనలో ఉందట టీమ్. అయితే ఈ రెండు సినిమాల విడుదల తేదీలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Next Story
-
Home
-
Menu