‘2018’ డైరెక్టర్ తో శివ కార్తికేయన్ చిత్రం ?

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ఆసక్తిరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న ‘పరాశక్తి’ నుంచి ఏఆర్ మురుగదాస్ హ్యాండిల్ చేస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘మదరాసి’ వరకు, ఎస్కే తన వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు.
తాజా సమాచారం ప్రకారం.. శివ కార్తికేయన్ మరో కొత్త ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం ఉంది. ‘2018’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన ప్రముఖ మలయాళ దర్శకుడు జూడ్ ఆంటోనీ జోసెఫ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడట. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో ప్రతినాయక పాత్ర కోసం తమిళ నటుడు ఆర్యను ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఏజీయస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నట్లు సమాచారం.
అంతేగాక.. ఈ సినిమా ఎస్కే కెరీర్‌లో అతిపెద్ద చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని టాక్. అయితే, ఇవన్నీ ప్రస్తుతానికి కేవలం ఊహాగానాలే. ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక మరో విశేషం ఏమిటంటే.. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించనున్న అట్లీ చిత్రంలో శివకార్తికేయన్ కూడా నటించే అవకాశముందని టాక్స్ వినిపిస్తు్న్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ పీరియడ్ డ్రామా కోసం మేకర్స్ మరో ప్రధాన పాత్ర కోసం శివ కార్తికేయన్ ను పరిశీలిస్తున్నారని సమాచారం.
ప్రస్తుతం శివకార్తికేయన్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పరాశక్తి’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసిన తరువాతే తన తదుపరి సినిమాలను ఖరారు చేసుకునే అవకాశం ఉంది. అయితే, ఎస్కే అల్లు అర్జున్ మూవీకి జాయిన్ అవుతాడా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. అయినప్పటికీ, ఈ వార్త మాత్రం అభిమానుల్లో భారీ స్థాయిలో ఆసక్తిని పెంచేసింది.
-
Home
-
Menu