సితార గ్రేట్.. మైత్రీతో అసంతృప్తి!

X
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిరీష్ రెడ్డి తన లేటెస్ట్ ఇంటర్యూలో పలు కాంట్రవర్శియల్ కామెంట్స్ చేశారు.
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిరీష్ రెడ్డి తన లేటెస్ట్ ఇంటర్యూలో పలు కాంట్రవర్శియల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తెలుగులో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ గురించి కంపార్ చేస్తూ 'నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది' అని వ్యాఖ్యానించారు.
డిస్ట్రిబ్యూటర్ గా ఆ రెండు నిర్మాణ సంస్థలతో తన అనుభవాన్ని పంచుకుంటూ.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ ఎంతో గ్రేట్ అన్నారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్స్ గురించి ఆలోచించే వ్యక్తి మా తర్వాత నాగవంశీ మాత్రమే అని శిరీష్ అన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ డబ్బు పోయినా తాను ఉన్నాననే ధైర్యాన్ని నాగవంశీ అందిస్తారని శిరీష్ అన్నారు. తమకు చాలా సార్లు నాగవంశీ అలాంటి ధైర్యాన్ని అందించారు.. కానీ మైత్రీ వాళ్లు తమకు చేయలేదని శిరీష్ రెడ్డి అన్నారు.
Next Story
-
Home
-
Menu