సిద్ధు-వైష్ణవి 'కిస్' మూమెంట్!

‘టిల్లు స్క్వేర్’తో భారీ హిట్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ, ‘బేబీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న సినిమా ‘జాక్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో, BVSN ప్రసాద్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ డ్రామా ఇప్పటికే మంచి హైప్ సంపాదించుకుంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఓ పాట విడుదల కాగా, తాజాగా మరో మెలోడియస్ ట్రాక్ ‘కిస్' సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి స్వరపరిచిన ఈ పాటకు సనారే లిరిక్స్ అందించగా, జావేద్ అలీ, అమల చేబోలు ఆలపించారు.
ఈ పాటలో సిద్ధు-వైష్ణవి రొమాంటిక్ కెమిస్ట్రీ హైలైట్‌గా ఉంది. ముద్దు పెట్టుకోవడానికి ప్రైవేట్ ప్లేస్ కోసం వెతికే థీమ్‌తో సాగిన ఈ పాటకు రాజు సుందరం డ్యాన్స్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాట విడుదలైన వెంటనే యూత్ నుంచి మంచి స్పందన అందుకుంటోంది.
-
Home
-
Menu