సిద్ధు జొన్నలగడ్డ వాలెంటైన్స్ డే ట్రీట్!

సిద్ధు జొన్నలగడ్డ వాలెంటైన్స్ డే ట్రీట్!
X
ఈ వాలెంటైన్స్ డే స్పెషల్ గా కొత్త సినిమాలే కాదు.. పాత సినిమాలు కూడా సరికొత్తగా థియేటర్లలోకి రాబోతున్నాయి. వాటిలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘కృష్ణ అండ్ హిస్ లీల‘ ఒకటి.

ఈ వాలెంటైన్స్ డే స్పెషల్ గా కొత్త సినిమాలే కాదు.. పాత సినిమాలు కూడా సరికొత్తగా థియేటర్లలోకి రాబోతున్నాయి. వాటిలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘కృష్ణ అండ్ హిస్ లీల‘ ఒకటి. రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, శాలిని హీరోయిన్లుగా నటించారు.

కోవిడ్-19 మహమ్మారి కారణంగా ‘కృష్ణ అండ్ హిస్ లీలా‘ మూవీ డైరెక్ట్ ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో విడుదలైంది. ఓటీటీలో ‘కృష్ణ అండ్ హిస్ లీల‘కి మంచి రెస్పాన్స్ దక్కింది. మళ్లీ ఐదు సంవత్సరాల తరువాత నిర్మాత రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు.

ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. అయితే ఈసారి ఈ చిత్రానికి ‘ఇట్స్ కాంప్లికేటెడ్‘ అనే కొత్త టైటిల్‌ ను ఫిక్స్ చేశారు. ఇదే విషయాన్ని నిర్మాత రానా, హీరో సిద్ధు, డైరెక్టర్ రవికాంత్ పేరెపు ఓ ఇంట్రెస్టింగ్ వీడియోతో కన్ఫమ్ చేశారు.




Tags

Next Story