సిద్ధు జొన్నలగడ్డ బర్త్ డే స్పెషల్స్!

సిద్ధు జొన్నలగడ్డ బర్త్ డే స్పెషల్స్!
X
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ‘ఎల్.బి.డబ్ల్యూ, గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల‘ వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు.

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ‘ఎల్.బి.డబ్ల్యూ, గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల‘ వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు. ‘డీజే టిల్లు‘ చిత్రం సిద్ధుని టాలీవుడ్ లో స్టార్ బాయ్ గా నిలిపింది. ఆ తర్వాత ‘టిల్లు స్క్వేర్‘తో అతని రేంజ్ మరో స్థాయికి చేరింది. ‘టిల్లు స్క్వేర్‘ తో వంద కోట్ల క్లబ్ లోకి సైతం చేరాడు సిద్ధు.

ప్రస్తుతం నీరజ కోన డైరెక్షన్ లో ‘తెలుసు కదా‘ చిత్రంతో పాటు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్‘ సినిమా చేస్తున్నాడు. అలాగే సితార ఎంటర్ టైన్ మెంట్స్ కోసం ‘కొహినూర్‘ సినిమాలో నటిస్తున్నాడు. వీటిలో ‘తెలుసు కదా‘ చిత్రం ట్రయాంగులర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. ఈ మూవీలో సిద్ధుకి జోడీగా రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఈరోజు సిద్ధు బర్త్ డే స్పెషల్ గా ‘తెలుసు కదా‘ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజయ్యింది.

బొమ్మరిల్లు భాస్కర్ ‘జాక్‘ మూవీలో సిద్ధుకి జోడీగా ‘బేబి‘ ఫేమ్ వైష్ణవి నటిస్తుంది. ‘జాక్‘ మూవీ టీజర్ ఈరోజు సాయంత్రం రిలీజ్ కానుంది. ఇక సిద్ధుని స్టార్ బాయ్ గా మార్చిన సితార సంస్థలో ‘కొహినూర్‘ చిత్రాన్ని రవికాంత్ పేరెపు తెరకెక్కిస్తున్నాడు. ఆద్యంతం కొహినూర్ వజ్రం ఇతివృత్తంతో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ‘కొహినూర్‘ సినిమా రూపొందుతుంది.

Tags

Next Story