అన్నదమ్ముల పోటీ బాక్సాఫీస్ వరకు?

టాలీవుడ్‌లో మంచు సోదరులు విష్ణు, మనోజ్ వ్యక్తిగతంగా తలపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే పోటీ బాక్సాఫీస్ వరకు వెళుతుందా అనే చర్చ సాగుతోంది. ఏప్రిల్ 25న మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'కన్నప్ప' విడుదల కానుండగా, అదే రోజున మనోజ్ కీలక పాత్రలో నటించిన 'భైరవం' కూడా థియేటర్లలో అడుగు పెట్టే అవకాశం ఉందనేది ఫిల్మ్ నగర్ టాక్.
ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి స్టార్స్ తో కూడిన 'కన్నప్ప' పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. త్వరలో శ్రీకాళహస్తిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు.
తమిళంలో హిట్టైన 'గరుడన్' ఆధారంగా 'భైరవం' రూపొందింది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. మాస్, కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండటంతో ఈ సినిమాపై మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మరి.. టాలీవుడ్‌లో అన్నదమ్ములు ఒకే రోజు పోటీపడటం అరుదైన విషయమే. చివరకు ఈ పోటీ ఎవరి సినిమాకు లాభం చేకూరుస్తుందో వేచి చూడాల్సిందే!
-
Home
-
Menu