సమంత నిర్మాణానికి 'శుభం'

సమంత నిర్మాణానికి శుభం
X
హీరోయిన్‌గా పీక్స్ చూసిన సమంత కొన్నాళ్లుగా సినిమాలను తగ్గించింది. మరోవైపు 'సిటాడెల్' వంటి వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ను అలరించింది. ప్రస్తుతం సామ్ నిర్మాతగా తొలి అడుగులు వేస్తుంది.

హీరోయిన్‌గా పీక్స్ చూసిన సమంత కొన్నాళ్లుగా సినిమాలను తగ్గించింది. మరోవైపు 'సిటాడెల్' వంటి వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ను అలరించింది. ప్రస్తుతం సామ్ నిర్మాతగా తొలి అడుగులు వేస్తుంది. ఆమధ్య తానే ప్రధాన పాత్రలో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాని అనౌన్స్‌చేసింది. అయితే అంతకంటే ముందే 'శుభం' అనే చిత్రంతో నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆమె స్థాపించిన త్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ నుంచి తొలి సినిమాగా 'శుభం' ప్రాజెక్ట్‌ వస్తోంది. కామెడీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో యువ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ఇప్పటికే ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Tags

Next Story