
'జైలర్ 2' లో శ్రద్ధా శ్రీనాథ్?

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం “జైలర్ 2” పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రం గురించి సన్ పిక్చర్స్ జనవరి 14న అధికారిక ప్రకటన చేయనున్నట్లు వెల్లడించింది. తమిళనాట దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ టీజర్ పలు థియేటర్లలో ప్రదర్శించబడనుంది.
“మా అనౌన్స్ మెంట్ టీజర్ ప్రత్యేక ప్రదర్శన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో జరగడం లేదు. ఎందుకంటే అక్కడి థియేటర్లకు అవసరమైన అనుమతులు లభించలేదు''. అని సన్ పిక్చర్స్ తెలియజేసింది.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లోనే జైలర్ 2 తెరకెక్కనుంది. ఈ చిత్రం మొదటి భాగం తమిళ, తెలుగు భాషల్లో ఘన విజయం సాధించింది. మొదటి భాగంలో రజనీకాంత్ భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించగా.. ఆయనకు ప్రత్యేకమైన రొమాంటిక్ సీన్‌లు లేదా పాటలు లేవు. అయితే, తమన్నా ఒక ప్రత్యేక గీతంలో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక రెండో భాగంలో కొత్త పాత్రలు, కొత్త నటీనటులు పరిచయం కానున్నారు.
శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇది నిజమైతే, ఆమెకు ఇది గొప్ప అవకాశమవుతుంది. ఆమె కెరీర్‌కు ఇది మరింత అడ్వాంటేజ్ అవుతుంది. ప్రస్తుతం శ్రద్ధా శ్రీనాథ్ “డాకూ మహారాజ్” విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె జిల్లా కలెక్టర్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
-
Home
-
Menu