బన్నీ నుంచి షాకింగ్ సర్ప్రైజ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. కారణం? బన్నీ వాస్ వేసిన ఓ ట్వీట్. 'షాకింగ్ సర్‌ప్రైజ్' అంటూ ట్వీట్ చేయడంతో, అల్లు అర్జున్ బర్త్‌డే అయిన ఏప్రిల్ 8న భారీ అప్డేట్ రాబోతుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. గత కొద్దిరోజులుగా చెన్నైలో అల్లు అర్జున్, అట్లీ, సన్ పిక్చర్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ఈ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటికే అట్లీ-బన్నీ కాంబినేషన్ ఖాయమని, ఓ మాఫియా డాన్ నేపథ్యంలో ఆసక్తికరమైన కథకు స్క్రిప్ట్ కూడా సిద్ధమైందని వినిపిస్తోంది. సన్ పిక్చర్స్ తో కలిసి జీ స్టూడియోస్ కూడా ఈ సినిమాని నిర్మించనుందనే ప్రచారం ఉంది. ఈ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించే అవకాశాలూ ఉన్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ బర్త్‌డే స్పెషల్ గా ఏప్రిల్ 8న అట్లీ సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ రాబోతుంది.
మరోవైపు త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ చేసే సినిమాకి సంబంధించి అప్డేట్ కూడా ఆరోజే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ఒక చిత్రం, 'పుష్ప 3' కూడా బన్నీ కిట్టీలో ఉన్నాయి.
Be Prepared for the shocking surprise 🔥🔥
— Bunny Vas (@TheBunnyVas) April 6, 2025
April 8th 🌟🌟
-
Home
-
Menu