'గేమ్ ఛేంజర్' గురించి షాకింగ్ కామెంట్స్!

గేమ్ ఛేంజర్ గురించి షాకింగ్ కామెంట్స్!
X
దిల్‌రాజు సోదరుడు శిరీష్ రెడ్డి బయట పెద్దగా కనిపించకపోయినా సినిమా నిర్మాణంలోనూ, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలోనూ కీలకంగా ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

దిల్‌రాజు సోదరుడు శిరీష్ రెడ్డి బయట పెద్దగా కనిపించకపోయినా సినిమా నిర్మాణంలోనూ, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలోనూ కీలకంగా ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా థియేటర్ వ్యాపారంలోకి ఎందుకు వచ్చారన్న దానిపై మాట్లాడుతూ, 'గత్యంతరం లేకే వచ్చాం. ఒకవేళ యుద్ధంలో దిగితే చంపవలసి వచ్చినా చంపాలి, చావవలసి వచ్చినా చావాలి' అన్నారు. వ్యాపార ధోరణిలో తానూ దిల్ రాజూ వేరు వేరుగా వ్యవహరిస్తామని, తానైతే ముఖం మీద స్పష్టంగా చెప్పే మనిషినని తెలిపారు.

'గేమ్ ఛేంజర్' సినిమా విడుదల తర్వాత హీరోగానీ, డైరెక్టరుగానీ కనీసం ఫోన్ కాల్ కూడా చేయలేదని చెప్పడం వెనుక ఆయన మనస్సులో ఉన్న బాధ స్పష్టమైంది. హీరోల రెమ్యూనరేషన్‌లు తగ్గించాలి అన్న మాట సరికాదని, అది వారి హక్కు అని శిరీష్ వ్యాఖ్యానించారు.

అనిల్ రావిపూడి వంటి దర్శకులపై శిరీష్ కృతజ్ఞత వ్యక్తం చేశారు. 'అతను లేకపోతే ఈ స్థాయికి వచ్చేవాళ్లం కాదు' అన్నారు. F2, F3 వంటి విజయవంతమైన సినిమాలు తమ సంస్థకు బలమైన ఆదాయాన్ని తీసుకువచ్చాయని గుర్తు చేశారు.

పర్సంటేజ్ సిస్టమ్ గురించి మాట్లాడిన శిరీష్, 'సినిమా ఎంత వసూలైతే దానికి తగినట్టుగా లాభాల పంచడం జరగాలి. ఇది ప్రొడ్యూసర్, హీరో ఇద్దరికీ న్యాయంగా ఉంటుంది' అని తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్, సితార ఎంటర్టైన్మెంట్స్, వరంగల్ శ్రీను వంటి ఇండస్ట్రీలోని ప్రముఖులతో తమ బిజినెస్ రిలేషన్‌పై కూడా శిరీష్ ఓపెన్‌గా స్పందించారు. మొత్తంగా ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' గురించి శిరీష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags

Next Story