'అతడు' కోసం శోభన్ బాబుని అడిగారట!

అతడు కోసం శోభన్ బాబుని అడిగారట!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘అతడు’. 2005లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘అతడు’. 2005లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. వెండితెర కంటే మిన్నగా బుల్లితెరపై సంచలన రికార్డులు నెలకొల్పింది. లేటెస్ట్ గా 'అతడు' మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధమవుతుంది.

4K రిజల్యూషన్, డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ గా 'అతడు' రీ రిలీజవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో నిర్మాత మురళీమోహన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

మురళీమోహన్ మాట్లాడుతూ, త్రివిక్రమ్‌ను మొదట జయభేరి బ్యానర్ ద్వారా దర్శకుడిగా పరిచయం చేయాలనుకున్నామని, కానీ అతను రవికిశోర్‌కు ముందుగానే మాట ఇచ్చినందున ఆ అవకాశం వారి దగ్గరికి వెళ్లిందని తెలిపారు. త్రివిక్రమ్ కథను చాలా డీటెయిల్‌గా చెప్పాడనీ, మొదట హీరో పాత్ర నెగటివ్‌గా ఉన్నందున సంకోచించినప్పటికీ త్రివిక్రమ్ ఆ పాత్రను అద్భుతంగా మలిచాడాన్నారు.

ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా ఇంటి సెట్ వేశామని, క్లైమాక్స్ సీన్‌ను 28 రోజులు చిత్రీకరించామని వెల్లడించారు. సినిమాలో నాజర్ పోషించిన పాత్రకు తొలుత శోభన్ బాబును సంప్రదించామని, అయితే 'ప్రేక్షకులకు తాను ఎప్పటికీ హీరోగానే గుర్తుండాలని ఆయన కోరుకున్నారని' చెప్పారు మురళీ మోహన్.

Tags

Next Story