వెయ్యి కోట్ల బడ్జెట్ తో శంకర్ సినిమా

వెయ్యి కోట్ల బడ్జెట్ తో శంకర్ సినిమా
X
భారీ బడ్జెట్ చిత్రాలు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు శంకర్. అయితే ఇటీవల ‘ఇండియన్ 2, గేమ్ ఛేంజర్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశ పరిచాడు.

భారీ బడ్జెట్ చిత్రాలు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు శంకర్. అయితే ఇటీవల ‘ఇండియన్ 2, గేమ్ ఛేంజర్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశ పరిచాడు. అయినా.. శంకర్ తన పంథాలోనూ అత్యంత భారీ బడ్జెట్ తో మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న శంకర్, తన నెక్స్ట్ మూవీ 'వేల్పారి'గా ప్రకటించాడు.

ప్రముఖ రచయిత ఎస్.వెంకటేశన్ రాసిన పాపులర్ చారిత్రక నవల ‘వేల్పారి’ ఆధారంగా శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఈ నవల లక్షకు పైగా ప్రతులు అమ్ముడై, సాహిత్య అకాడమీ అవార్డును కూడా గెలుచుకుంది. 'వేల్పారి' అనే పాలకుడు చేర, చోళ, పాండ్య రాజవంశాల నుండి ఎదురైన ప్రతిఘటనల నేపథ్యంలో కథ సాగుతుంది.

ఈ చిత్రం రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందనుందని టాక్. ‘అవతార్, గేమ్ ఆఫ్ థ్రోన్స్’ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, టెక్నాలజీ, ఆర్ట్ డిజైన్స్ ఇందులో ఉండబోతున్నాయని శంకర్ తెలిపాడు. ఈ సినిమా ఇప్పటివరకు తాను చేసిన చిత్రాలకన్నా పెద్దదిగా ఉండనుందని ప్రకటించాడు శంకర్.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నటీనటులు, నిర్మాణ సంస్థ వివరాలు అధికారికంగా వెల్లడించలేదు. అయితే కన్నడ స్టార్ యశ్‌ను సంప్రదించినట్టు గాసిప్ వినిపిస్తుండగా, కరణ్ జోహార్, నెట్‌ఫ్లిక్స్, పెన్ స్టూడియోస్ కలిసి నిర్మించే అవకాశం ఉందని సమాచారం.

Tags

Next Story