షూటింగ్ లో గాయపడ్డ షారుక్

షూటింగ్ లో గాయపడ్డ షారుక్
X
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ గాయపడ్డాడు. ‘కింగ్‘ మూవీ యాక్షన్ సన్నివేశం సమయంలో డూప్ ఉపయోగించకుండా స్టంట్ చేస్తుండగా గాయపడ్డాడు.

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ గాయపడ్డాడు. ‘కింగ్‘ మూవీ యాక్షన్ సన్నివేశం సమయంలో డూప్ ఉపయోగించకుండా స్టంట్ చేస్తుండగా గాయపడ్డాడు. దీంతో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. చికిత్స కోసం ఆయన తన బృందంతో కలిసి అమెరికా వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది తీవ్ర గాయం కాదని, కండరాలకు సంబంధించిన గాయమేనని షారుక్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఈ సంఘటన నేపథ్యంలో సెప్టెంబర్ వరకు షూటింగ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కింగ్’ సినిమాలో దీపిక, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, షారుక్ కుమార్తె సుహానా ఖాన్, సీనియర్ హీరోయిన్ రాణీ ముఖర్జీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘పఠాన్, జవాన్, డంకీ‘ వంటి సినిమాల తర్వాత షారుక్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌ ‘కింగ్‘ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags

Next Story