పూరితో సినిమా గురించి సేతుపతి!

పూరితో సినిమా గురించి సేతుపతి!
X
టాలీవుడ్‌లో ఒకప్పుడు సూపర్ హిట్‌ల జోరుమీదున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్. అయితే గత కొంతకాలంగా మాత్రం వరుస పరాజయాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్‌లో ఒకప్పుడు సూపర్ హిట్‌ల జోరుమీదున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్. అయితే గత కొంతకాలంగా మాత్రం వరుస పరాజయాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా, తన తర్వాతి సినిమాని అనౌన్స్ చేశాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈనేపథ్యంలో ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్ తో సినిమా చేయడం విజయ్ సేతుపతికి రిస్క్ అన్న వాళ్లున్నారు.

లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్‌ గురించి స్వయంగా హీరో విజయ్ సేతుపతి స్పందించాడు. తన సినిమాల ఎంపిక వెనుక ఉన్న దృక్పథాన్ని అందరితో పంచుకున్నాడు. ‘ఒక డైరెక్టర్ గత ఫలితాల ఆధారంగా నేను నిర్ణయం తీసుకోను. నాకు కథ నచ్చితేనే సినిమా చేస్తాను‘ అని స్పష్టంగా చెప్పాడు. అలాగే పూరి జగన్నాథ్ చెప్పిన కథ తనను ఎంతగానో ఆకట్టుకుందనీ, ఇప్పటివరకు తాను చేయని పాత్రగా భావించడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని తెలిపాడు విజయ్ సేతుపతి.

ఇదే సందర్భంలో పూరి జగన్నాథ్‌కి ఇది ఓ కీలక అవకాశంగా మారొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక విజయ్ సేతుపతితో చేయబోయే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే, పూరి మళ్లీ తిరిగి ట్రాక్ మీదికి వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటి టబు కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ ఏడాది జూన్ నుంచి ఈ సినిమా పట్టాలెక్కనుంది.

Tags

Next Story